Tuesday, February 28, 2012

భారత దేశపు తొలి సముద్రపు వంతెన పంబన్ బ్రిడ్జి విశేషాలు..ఇంజనీరింగ్ అద్భుతం ..!!!


                    రామేశ్వరానికి వెళ్ళేదారిలో కనిపిస్తుంది ఈ పంబన్ రైలు మరియు రోడ్  బ్రిడ్జి.ఈ వంతెన  రామేశ్వరం ద్వీపాన్ని మరియు భారత ప్రధాన భూభాగాన్ని కలుపుతుంది .రైలు వంతెనలు సాధారణం గానే ఉండేవి కదా అని అనుకుంటున్నారా.....!!! నిజమేనండి...కానీ ఈ వంతెన కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయండోయ్.... అవేంటో తెలుసుకోవాలంటే ఇక్కడ చదివేయండి . 

  • ఈ పంబన్ బ్రిడ్జి భారతదేశపు తొలి సముద్రపు వంతెన, 
  • దీని నిర్మాణం బ్రిటిష్ వారికాలం లో 1887 లో మొదలయి 1912 లో పూర్తయింది.
  • భారత దేశం లో ఉన్న సముద్రపు వంతెనలలో ఇది రెండవ అతి పెద్ద సముద్రపు వంతెన.( మొదటిది ముంబై లో ఉన్న బాద్ర- వర్లి సముద్రపు వంతెన) 
  • ఈ వంతెన దాదాపు 2 కిలోమీటర్ల (2065 మీటర్లు) పొడవు ఉంటుంది. ఇది సముద్రం మీద palk జలసంధి మీద నిర్మించారు కాబట్టి ఓడల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఈ బ్రిడ్జి మధ్య భాగం రెండుగా విడివడి పైకి లేస్తుంది.( ఫోటో చూడండి)

  • ఈ వంతెన 2007 కి ముందు మీటర్ గేజ్ మార్గం గా ఉండేది. 2007 ఆగష్టు 12 న బ్రాడ్ గేజ్ మార్గం గా మార్చడం జరిగింది.
  • ఈ బ్రిడ్జి సముద్ర ఉప్పునీటి గాలుల వలన తుప్పుపట్టే అవకాశం ఉన్నాదాదాపు శతాబ్ద కాలం గా  తట్టుకుని నిలబడి ఇంజనీరింగ్ అద్భుతానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది.
  • ఈ బ్రిడ్జి ఉన్న ప్రదేశం అతివేగంగా గాలులు వీచే తుఫాను ప్రభావిత ప్రాంతం లో ఉంది.రైలు లో ఈ బ్రిడ్జి మీద ప్రయాణం చేసేటప్పుడు పడిపోతామేమో అనే భయం కూడా కలుగుతుంది. ( నేను అనుభవించాను కూడా )
  • ఈ బ్రిడ్జి కి 143 స్థంబాలు ఉన్నాయి. ఈ బ్రిడ్జి మధ్య భాగాన్ని స్విచ్చర్స్ బ్రిడ్జి అంటారు. 
  • ఈ బ్రిడ్జి పక్కనే 1989  లో రోడ్ వంతెనని కూడా అందుబాటులోకి తెచ్చారు.అప్పటి వరకు ఈ రైలు మార్గాన్నే భారత  ప్రధాన భూభాగానికి మరియు రామేశ్వరం, ధనుష్కోటి ద్వీపానికి రాకపోకలకు వినియోగించేవారు.
  • ఈ వంతెన మీద భారత ప్రభుత్వం ఒక తపాలా బిళ్ళని కూడా విడుదల చేసింది.

  • ఈ వంతెన ప్రవేశం వద్ద ఒక వ్యక్తి  ఏడుస్తూ కొన్ని శరీర అవయవాలు పట్టుకుని నిలబడ్డట్లు ఉంటుందట. ఈ బొమ్మ  గురించి రకరకాల పుకార్లు కూడా ప్రచారం లో ఉన్నాయండోయ్. అందులో అత్యంత ప్రచారం పొందిన పుకారుని ఇక్కడ రాస్తున్నా చూడండి.
                                  ఓడలు వచ్చినపుడు బ్రిడ్జి మధ్య భాగాన్ని పైకి లేపడానికి బ్రిటిష్ వారికాలం లో ఒక మధ్య వయస్కుడిని నియమించారట. ఒక సారి ఓడ వెళ్ళిన తరువాత ఆ వ్యక్తి ఆ వంతెనను సాధారణ స్థితి కి తెస్తుండగా ఒక రైలు రావడం గమనిన్చాడట. ఆ వ్యక్తి ఆ వంతెనను సాధారణ స్థితిలోకి తీసుకు వచ్చేందుకు అతివేగంగా పుల్లీలను తిప్పడం మొదలెట్టాడట. అతను అలా చేయక పోతే ఆ రైలు సముద్రం లో పడిపోయి వేలాది ప్రాణాలు నీటిలో కలిసిపోతాయి.ఈ సమయం లో అతని 9 సంవత్సరాల కుమారుడు ఆ వ్యక్తికి భోజనం తీసుకుని వచ్చాడు. తండ్రి కష్టపడటం చూసి తను కూడా ఆ పుల్లీలను తిప్పడంలో సహాయం చేయసాగాడట. అయితే దురదృష్టవశాత్తు ఈ పుల్లీలను తిప్పే క్రమంలో ఆబాలుడి  చేయి ఆ పుల్లీలకు కలుపబడిన వైర్లలో పడిందట. ఆ బాలుడు నొప్పితో ఏడవ సాగాడట. అయితే వేలాది ప్రాణాలకంటే తన కుమారుడి ప్రాణాలు ముఖ్యం కాదనుకున్న ఆ వ్యక్తి బాలుడి ఏడుపుని పట్టించుకోకుండా ఆ     పుల్లీని తిప్పి బ్రిడ్జి ని సాధారణ స్థితికి తెచ్చి రైలు లో ఉన్న అందరి ప్రాణాలు కాపాడాడట. ఈ లోగా ఆ యంత్రంలో పది ఆ వ్యక్తి కుమారుడి ప్రాణాలు పోగొట్టుకున్నాడట. ఈ వ్యక్తి గొప్పతనాన్ని మెచ్చిన బ్రిటిష్ ప్రభుత్వం ఆ వంతెన ద్వారం వద్ద ఆ వ్యక్తి బొమ్మని పెట్టిందట. ఈ బొమ్మ ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి ఏడుస్తూ కొన్ని శరీర అవయవాలు పట్టుకుని నిలబడ్డట్లు ఉంటుందట.

    ఇవండీ పంబన్ బ్రిడ్జి విశేషాలు..... ధనుష్కోటి విశేషాలతో మరొక టపాలో కలుద్దాం...!!!

    2 comments:

    1. Super Guruvu Garu... asalu ilanti varadhi okati undani naku ippati varaku teliyadu... mee valana oka kotha vishayanni telusukunnanu... chala bagundi.. inka ilanti kotha vishayalanu meeru post cheyalani korukuntunnanu.... superb

      ReplyDelete
    2. సూపర్ గురువు గారు.... ఈ పంబన్ వారధి గురించి ఇప్పటి వరకు నాకు తెలియదు... ఈ విషయాన్ని చెప్పి నాకు ఒక కొత్త విషయాన్ని తెలుసుకొనే అవకాశము ఇచ్చారు. ఇంకా ఇలాంటి కొత్త విషయాల కోసము ఎదురు చూస్తూ ఉంటాము...

      ReplyDelete